సర్కారు వారి ఖరీదైన 'ఐటెమ్' పాట!


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే కమర్షియల్ గా అన్ని రకాల ఎలిమెంట్స్ హైలెట్ అవ్వాల్సిందే. సెంటిమెంట్, యాక్షన్, మెస్సేజ్, కామెడీ అలాగే కాస్త గ్లామర్ కూడా ఉండి తీరాల్సిందే. సర్కారు వారి పాటలో కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్ పక్కా ప్లాన్ తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలో గ్లామర్ టచ్ కోసం ఖరుదైన బ్యూటీని దింపుతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు.. శ్రీలంకన్ బ్యూటీ జక్వాలిన్ ఫెర్నాండెజ్. ఇదివరకే సాహోలో బ్యాడ్ బాయ్ అంటూ హీటెక్కించింది. అందుకోసం 2కోట్ల వరకు డిమాండ్ చేసింది. ఇక ఇప్పుడు కాస్త ఎక్కువ అడిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోటి ఇస్తే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ కు రెడీగా ఉన్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడదు కాబట్టి జక్వాలిన్ ను ఫైనల్ చేయవచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post