శేఖర్ కమ్ముల - ధనుష్ మూవీ లో.. వెంకటేష్, సాయి పల్లవి?


సెన్సిటివ్ కథలతో హార్ట్ ను టచ్ చేసే శేఖర్ కమ్ముల మొదటిసారి ఒక తమిళ స్టార్ హీరోతో సినిమా చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ లాంటి హీరో ఒప్పుకున్నాడు అంటే తప్పకుండా కమ్ముల కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందరికి ముందే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది.

అలాగే మరొక హీరో కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ గా మరోసారి సాయిపల్లవిని అనుకుంటున్నట్లు అప్పుడే గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక ఎవరు ఊహించని విధంగా వెంకటేష్ కూడా అందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి నటిస్తుందో లేదో తెలియదు గాని గతంలో అయితే శేఖర్ కమ్ముల వెంకటేష్ ను కలిసి ఒక కథపై చర్చలు జరిపాడు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post