టాలీవుడ్ పెద్ద సినిమాలకు పోటీగా విజయ్ Beast!


లాక్ డౌన్ సడలింపులతో థియేటర్స్ కు పూర్వవైభవం రానున్నట్లు తెలుస్తోంది. కరోనా మరో దశలో రాకుండా ఉండగలిగితే బాక్సాఫీస్ జోరును ఎవరు ఆపలేరు. అయితే సినిమాలు వెండితెరపైకి రాకముందే రిలీజ్ డేట్స్ విషయంలో గట్టిగానే పోటీ పడబోతున్నాయి. స్టార్ హీరోలైతే పండగలను టార్గెట్ చేశారు.

ఇక కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ బీస్ట్ సినిమా వచ్చే సంక్రాంతికి రావచ్చని తెలుస్తోంది. ఆ సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం తప్పదు. ముఖ్యంగా మన పాన్ ఇండియా సినిమాలు కాస్త వెనక్కి తగ్గాల్సిందే. ఎందుకంటే RRR, పుష్ప సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తమిళ్ లో కూడా భారీగా రిలీజ్ కానున్నాయి. తమిళ మార్కెట్ ఈ సినిమాలకు చాలా అవసరం. ఇక విజయ్ తమిళ్ లో రెచ్చిపోతే ఏ సినిమా కూడా అడ్డు పడలేదు. మరి ఇలాంటి పోటీలో మన పాన్ ఇండియా సినిమాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post