జనతా గ్యారేజ్ రీమేక్.. బాలీవుడ్ హీరోకు భారీ అడ్వాన్స్!


ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 2016 బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ హిందీలో రీమేక్ కానున్నట్లు మరోసారి బజ్ క్రియేట్ అవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అందులో నటించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ లో జనతా గ్యారేజ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. 

ఇక అదే బ్యానర్ హిందీ వెర్షన్‌ను నిర్మిస్తుందని సమాచారం.   మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల సల్మాన్ ను కలుసుకున్నారని అడ్వాన్స్ గా భారీ రెమ్యునరేషన్ ను కూడా ఇచ్చారని పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రాజెక్ట్ 2023లో సెట్స్ పైకి రావచ్చని సమాచారం. జనతా గ్యారేజీలో మలయాళం స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరి అలాంటి బలమైన పాత్రను హిందీలో ఎవరు పోషిస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post