జాతిరత్నాలు డైరెక్టర్.. ఈ సెలక్షన్ ఊహించలేదు?


జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న యువ దర్శకుడు అనుదీప్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది అందరిలో ఒక తెలియని ఆసక్తిని కలిగిస్తోంది. వైజయంతి ప్రొడక్షన్ వారి స్వప్న సినిమాస్ లోనే మరొక సినిమా చేయాల్సి ఉంది. అతని దగ్గర ప్రస్తుతం నాలుగైదు కథలు ఉన్నాయట.

జాతిరత్నాలు హిట్టయిన తరువాత మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మరో కామెడీ సినిమా చేయాలని ఉందని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఊహించని విధంగా అతను తమిళ హీరోపై ఫోకస్ పెట్టినట్లు టాక్ వస్తోంది. ఆ హీరో మరెవరో కాదు శివకార్తియేన్. తెలుగు తమిళ్ లో ఒకేసారి మూవీ తీసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎలా రూపొందుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post