షాకింగ్ న్యూస్: కత్తి మహేష్ కన్నుమూత

 


నటుడు, చిత్ర సమీక్షకుడు కత్తి మహేష్ కన్నుమూశాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్ గా కూడా కత్తి మహేష్ గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. గత నెల 26న  కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఇన్ని రోజులు హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ వచ్చారు.  నెల్లూరులోని చంద్రశేఖరపురం హైవేపై మహేష్ కారు అతి వేగం వలన అదుపు తప్పి ఒక లారీని ఢీకొట్టడంతో ఆ ప్రమాదం జరిగింది.


ప్రమాదంలో మహేష్‌ మొహానికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక కన్ను కూడా కోల్పోయినట్లు కథనాలు వచ్చాయి. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే అతనికి ఎక్కువగా దెబ్బలు తగిలాయి. ఇక ప్రతి రోజు అతని పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. సన్నిహితులు కూడా అతని కోసం అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చారు. ఇక కొద్దీ సేపటి క్రితమే అతను మరణించినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కొంతమంది సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post