ధనుష్ దర్శకత్వంలో రజనీకాంత్ 170?


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాలి అంటే లక్కు కూడా కలిసి రావాలి. ఏడు పదుల వయసులో కూడా తలైవా యువ దర్శకులతో వర్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రోబో అనంతరం ఆయన మళ్ళీ అనుకున్నంతగా హిట్ అయితే అందుకోలేదు గాని మార్కెట్ అయితే అలానే ఉంది.

ఎలాంటి సినిమా చేసినా కూడా ఓపెనింగ్స్ తోనే నిర్మాతలను సేవ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో రజనీకాంత్ తన 168వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అన్నత్తే టైటిల్ తో రానున్న ఆ సినిమా దీపావళికి సందడి చేయనుంది. ఇక త్వరలోనే ధనుష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 169వ సినిమాను 'కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యదితాల్' ఫేమ్ దేశింగ్ పెరియసామి డైరెక్ట్ చేయనున్నాడు. ఇక 170వ ప్రాజెక్ట్ ధనుష్ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదివరకే పావర్ పాండి సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్న ధనుష్ తమ మామను బిగ్ స్క్రీన్ పై ఎలా చూపిస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post