అల్లు అర్జున్ ఐకాన్.. మళ్లీ అదే కాంబినేషన్!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోతాడు అని సుకుమార్ చాలా బలంగా చెప్పాడు. పుష్ప  సినిమా తప్పకుండా పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అవుతుందని క్రియేట్ అవుతున్న బజ్ ను చూస్తేనే అర్థమవుతోంది. ఇక సినిమా అనంతరం అల్లు అర్జున్ ఐకాన్ సినిమాలు సెట్స్ పైకి తీసుకురాన్నాడు.

వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్న ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్సైనట్లు మరో టాక్ వైరల్ అవుతోంది. డీజే సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన పూజా హెగ్డే ఆ తర్వాత అల వైకుంఠ పురం లో కూడా మరోసారి జత కట్టి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ అనుకునేలా చేసింది. ఇక ఐకాన్ సినిమాలో కూడా ఈ బ్యూటీని కథానాయికగా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుట్ట బొమ్మ చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ సినిమాతో పాటు బాలీవుడ్లో మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మరో రెండు పెద్ద సినిమాల ఆఫర్స్ అందుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక బన్నీతో మరోసారి రొమాన్స్ చేస్తుందో లేదో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Post a Comment

Previous Post Next Post