RRR: ప్రతి పది నిమిషాలకు ఒకసారి.. అలాంటి సీన్స్!


RRR సినిమా కోసం మెగా నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాహుబలి 2 రికార్డులను బ్లాస్ట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. 900కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.

ఇక RRRకు సంబంధించిన స్పెషల్ న్యూస్ ఒకటి లీక్ అయ్యింది. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండేలా దర్శకుడు రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ తోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ తగ్గకుండా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకరి తరువాత మరొకరు ఎమోషన్స్ తో పాటు ఫైట్ సన్నివేశాలతో భారీ స్థాయిలో ఆకట్టుకుంటారట. మరి వెండితెరపై అభిమానులను ఆ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన విషయం తెలిసిందే..


Post a Comment

Previous Post Next Post