ప్రస్తుతం బాలీవుడ్ లో పఠాన్ మూవీలో హీరోగా అలానే లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర సినిమాల్లో స్పెషల్ అపీయరెన్స్ రోల్స్ లో నటిస్తున్న కింగ్ ఖాన్ షారుఖ్, తదుపరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా వేగంగా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో షారుఖ్ చేయనున్న తదుపరి సినిమా ఖరారయినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఈ మూవీ స్టోరీ పై కసరత్తు చేసి ఎట్టకేలకు స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసిన అట్లీ, ప్రస్తుతం ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక మొదలెట్టాడట.
స్టార్ నటి నయనతార హీరోయిన్ గా ఈ సినిమాలో నటించనుందని, అలానే యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ సంగీత దర్శకుడిగా పలు సక్సెస్ఫుల్ సినిమాలకు అద్భుతమైన సాంగ్స్ అందించిన అనిరుద్, ప్రస్తుతం షారుఖ్ కోసం సూపర్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి విషయాలు అఫీషియల్ గా వెల్లడికానున్నాయని అంటున్నాయి బి టౌన్ వర్గాలు. ఈ న్యూస్ నిజం అయితే బాలీవుడ్ లోకి అనిరుద్ ఎంట్రీ ఇచ్చే ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది.
Follow @TBO_Updates
Post a Comment