ఇప్పటికే త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 పై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. మరొకసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ తాజా సీజన్ లో కంటెస్టెంట్స్ ని ఇటీవల ఫైనలైజ్ చేసిన బిగ్ బాస్ టీమ్ ప్రస్తుతం వారిని ఒక ప్రముఖ హోటల్ క్వారంటైన్ లో ఉంచినట్లు సమాచారం.
అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం వారందరికీ నేడు కరోనా టెస్ట్ నిర్వహించగా అందులో కొందరికి మాత్రం పాజిటివ్ వచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై బిగ్ బాస్ యాజమాన్యం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ మరి ఇదే కనుక నిజం అయితే షో వాయిదా పడుతుందా అనేటువంటి సందేహాన్ని కొందరు వ్యక్త పారిస్తున్నారు. కాగా ఈ షో సెప్టెంబర్ 5న స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment