ప్రేమ విషయం పై నోరు విప్పిన కియారా అద్వానీ!


మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ తెలుగులో మంచి క్రేజ్ అయితే అందుకుంది. అనంతరం వెబ్టనే వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ ఎదురైనప్పటికీ ఆమెకు అవకాశాలు అయితే ఏ మాత్రం తగ్గలేదు. చాలా ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తోంది. నచ్చకపోతే ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే రిజెక్ట్ చేస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక చాలా కాలం నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా 5టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కియారా అద్వానీ లవ్ రూమర్స్ పై అనేక రకాల  గా చూస్తున్నాయి ఆమె ప్రేమలో ప్రేమలో ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక కీయరా మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని ఇటీవల క్లారిటీ ఇచ్చేసింది. ఆ హీరోతో చేసిన షేర్ షా సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక ప్రమోషన్లో భాగంగా ప్రేమ విషయంపై కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగానే అతనితో నాకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని అంటూ ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని కుండ బద్దలు కొట్టేసింది మొత్తం తన ఫోకస్ సినిమా కెరీర్ పైన ఉందని, చాలా గోల్స్ ఉన్నాయని మాట్లాడింది. ఫైనల్ గా ప్రస్తుతం అయితే పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా లేనట్లు తేల్చేసింది.


Post a Comment

Previous Post Next Post