స్టార్ హీరో కోసం ఎదురుచూస్తున్న Rx100 దర్శకుడు!


Rx100 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి నెక్స్ట్ మహాసముద్రం అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే సిద్ధార్థ్ శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమా అనంతరం అజయ్ భూపతి తన మూడవ సినిమాను మాత్రమే స్టార్ హీరోతోనే చేయాలని అనుకుంటున్నాడు.

మూడవ సినిమాను సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లోనే పూర్తిగా స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందట. రవితేజ గోపీచంద్ వంటి మీడియం రేంజ్ హీరోలను కూడా సంప్రదించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మొదట మహా సముద్రం కోసం చాలామంది మీడియం రేంజ్ హీరోలను టచ్ చేసిన అజయ్ వారి నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు మూడవ సినిమాతో అయినా తనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటాడో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post