మెహర్ రమేష్ లో పోకిరి, దేశముదురు!


సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు సక్సెస్ రేట్ ఉంటేనే ఎక్కువ  అవకాశాలు వస్తుంటాయి. కమర్షియల్ దర్శకుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. అయితే సినిమా ఇండస్ట్రీలో అందరితో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన కూడా అవకాశాలు అయితే అంత ఈజీగా రావు. ఇక మెహర్ రమేష్, మెగాస్టార్ తో వేదళం రీమేక్ చేయడం వెనకున్న మ్యాజిక్ ఏమిటనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.

అయితే మెగాస్టార్.. మెహర్ రమేష్ ను నమ్మడానికి ఒక కారణం అయితే ఉంది. అతను ఇప్పటివరకు రీమేక్ విషయాల్లో ఫెయిల్ అవ్వలేదు. ఆంధ్రవాలా డిజాస్టర్ అయినా అదే కథను కన్నడలో తీసి హిట్టు కొట్టాడు. ఇక దేశముదురు, పోకిరి సినిమాలకు కూడా స్క్రిప్ట్ లో వర్క్ చేసి సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం బిల్లా హిట్టయిన తరువాత శక్తి, షాడో అతన్ని దెబ్బ కొట్టాయి. ఇక మెగాస్టార్ మాత్రం మెహర రమేష్ లోని పాజిటివ్ అంశాలను తీసుకొని అతనికి ఛాన్స్ ఇస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post