బంగార్రాజు కోసం మరో రిస్క్ చేస్తున్న నాగార్జున!


కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ తీసిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. 2016లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాని అన్నపుర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సొంతంగా నిర్మించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మొన్న అఫీషియల్ గా లాంచ్ అయిన ఈ సినిమాలో నాగార్జున తో పాటు అక్కినేని నాగచైతన్య కూడా నటించనున్నారు. హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు.

కాగా మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ మూవీని తీయనున్నట్లు టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా కోసం నాగార్జున భారీ స్థాయిలో బడ్జెట్ ఖర్చు చేయనున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. సొంత బ్యానర్ కావడంతో పాటు మూవీ పై నాగార్జునకు ఎంతో నమ్మకం ఉండడంతో ఇంత భారీగా ఖర్చు పెడుతున్నారని, అలానే కథ ప్రకారం కొన్ని సీన్స్ కి ఆమాత్రం ఖర్చు అవుతుందని ఇన్నర్ వర్గాల వారు చెపుతున్నారట. మరి సోగ్గాడే చిన్ని నాయన మాదిరిగా బంగార్రాజు కూడా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి.


Post a Comment

Previous Post Next Post