PK - MB కాంబినేషన్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్?


టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ మార్కెట్ తో పాటు అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. వీరి మధ్య సాన్నిహిత్యం చాలా ఫ్రెండ్లిగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అది మల్టీస్టారర్ కాదు. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ తో పవన్ కళ్యాణ్ ను మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు నిర్మాతగా సెట్ చేసే పనిలో ఉన్నట్లు టాక్ వస్తోంది. SSMB28 ప్రాజెక్ట్ ను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా PK క్రియేటివ్ వర్క్స్ కూడా సినిమా ప్రొడక్షన్ లో భాగం కానున్నట్లు సమాచారం. అలా సెట్టయితే గనక సినిమాకు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అవ్వడం పక్కా. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్లాన్ పై మహేష్ బాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post