ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం... రాజమౌళి చివరికి వాళ్ళను ఒప్పిస్తున్నడ..?


టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ బిగ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో ఎంతో మంచి క్రేజ్ ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతునంట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాని అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే అప్పటికి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాదని తెలియడంతో ప్రస్తుతం సినిమాని మరొక్కసారి వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారట. 

అయితే మొదట రాబోయే సమ్మర్ కి మూవీ ని రిలీజ్ చేద్దాం అని భావించినప్పటికీ, అప్పటికి మరింత ఆలస్యం అవుతుందని భావించిన టీమ్, రాబోయే సంక్రాంతి కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే సంక్రాంతికి ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాల దర్శకనిర్మాతలని ప్రస్తుతం ఒప్పించే పనిలో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉన్నారని, మరోవైపు ఈ మూడు సినిమాల వారు రాజమౌళి అభ్యర్థనకు ఒప్పుకుని తమ సినిమాలని వాయిదా వేయడానికి ఫిక్స్ అయ్యారని టాక్. ఇక త్వరలోనే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post