మాస్ రాజా.. ఆ దర్శకుడితో ఐదోసారి!


మాస్ మహారాజా రవితేజ మొత్తానికి క్రాక్ తో మాత్రం ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక తర్వాత సినిమాలతో కూడా అదే తరహాలో బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలని నమ్మకమైన కథలను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అయితే కేవలం సక్సెస్ లో ఉన్న దర్శకులను మాత్రమే కాకుండా ఫెయిల్యూర్ లో ఉన్న ఒకప్పటి స్టార్ దర్శకులకు కూడా లైన్ లో పెట్టడం విశేషం.

రవితేజ హీరోగా నటించిన మొదటి సినిమా నీకోసం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శ్రీనువైట్ల - రవితేజకు చాలా మంచి స్నేహితుడు. వీరి కాంబోలో వచ్చిన దుబాయ్ శీను, వెంకీ సినిమాలి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకున్నాయి. అయితే చివరగా చేసిన అమర్ అక్బర్ అంథోని సినిమా మాత్రం అంతగా హిట్టవ్వలేదు. ఇక ఈసారి ఎలాగైనా రవి తేజ శ్రీనువైట్లతో మరొక హిట్టు కథను రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మంచు విష్ణు కోసం మరో డీ లాంటి కథను తయారు చేస్తున్న శ్రీనువైట్ల ఆ సినిమా తర్వాత రవితేజతో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రవితేజ కిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post