పుష్ప నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ ఫిక్స్ ... ??


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుస సక్సెస్ ల భామ రష్మిక మందన్న తొలిసారిగా కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ తీస్తున్న ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ప్రముఖ యాక్టర్ ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. గంధపు చెక్కల అక్రమ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీనిని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు సుకుమార్ తీస్తుననట్లు సమాచారం. 

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రీ లూక్ టీజర్, అలానే దాక్కో దాక్కో మేక సాంగ్ రెండూ కూడా ప్రేక్షకాభిమానులు నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుని పుష్ప పార్ట్ 1 పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. అయితే పలు టాలీవుడ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు చెప్తున్నారు. ఆకట్టుకునే మెలోడీ గా సాగె ఈ సాంగ్ యువతని ఆకరిస్తుందని టాక్. కాగా పుష్ప పార్ట్ 1 మూవీ క్రిస్మస్ పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే .... !!


Post a Comment

Previous Post Next Post