గబ్బర్ సింగ్ కాంబో.. గేట్ రెడీ!


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న రెండు సినిమాల షూటింగ్స్ ని ఒకదాని వెంట మరొకటి వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అయితే వాటిలో సాగర్ కె చంద్ర తీస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానున్నట్లు సమాచారం. 

ఇక సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భీమ్లా నాయక్ నుండి ఫస్ట్ సాంగ్ విడుదల కానుండగా అదే రోజున పవన్ తో గబ్బర్ సింగ్ డైరెకర్ హరీష్ శంకర్ తీయనున్న భారీ సినిమా కి సంబంధించి ఒక అప్ డేట్ కూడా రానుందనిట్ సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో పవన్ కి జోడీగా ఒక బాలీవుడ్ భామ నటించనుందని, అలానే ఈ సినిమాని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post