మహేష్ బాబుతో సెకండ్ ప్రాజెక్ట్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!


గత సంవత్సరం సరిలేరు నీకెవ్వరు ఘన విజయం తరువాత, హీరో మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి మరొక ప్రాజెక్ట్‌ను కూడా వెంటనే చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్  అలాగే వివిష కమిట్మెంట్స్ వలన ఆ సినిమా తొందరగా మొదలవ్వలేదు. ప్రస్తుతం సర్కారు వారి పాటతో  బిజీగా ఉన్న మహేష్, అనంతరం దర్శకుడు త్రివిక్రమ్‌తో కలవబోతున్నాడు, ఆ తరువాత రాజమౌళి దర్శకత్వం వహించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు.

దీని బట్టి మహేష్ 2022 నాటికి రాజమౌళి చిత్రాన్ని పూర్తి చేస్తే గాని కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి స్వేచ్ఛ ఉండదు. మరోవైపు, అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్‌లో బాలకృష్ణకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడు.  రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ మహేష్ బాబుతో తన రెండవ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. "నేను ఇప్పటికే మహేష్ సార్‌కి స్టోరీలైన్ చెప్పాను. ఆయనకు అది బాగా నచ్చింది.  ఏదేమైనా, ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కావున డేట్స్ దొరకడం కష్టమే. కానీ తప్పకుండా మహేష్ బాబుతో మరొక సినిమా ఉంటుంది.. అని అనిల్ వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post