పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ నుండి ఇటీవల పవర్ స్టార్ మాస్ లుక్ టీజర్ విడుదల చేసారు యూనిట్ సభ్యులు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా కి స్క్రీన్ ప్లే ని త్రివిక్రమ్ అందిస్తుండగా యూత్ దర్శకుడు సాగర్ కె చంద్ర దీనిని తెరకెక్కిస్తున్నారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కి రీమేక్ గా రూపొందుతున్న ఏ సినిమాలో పవన్ పేరు భీంలా నాయక్ కాగా, రానా పేరు డ్యానియల్ శేఖర్. అయితే మొన్న విడుదలైన టీజర్ లో భీమ్లా నాయక్ అని టైటిల్ ఉండడంతో అదే సినిమా అసలు టైటిల్ అని అందరూ భావిస్తుండగా, అది కేవలం పవన్ పాత్ర పేరు మాత్రమే అని, త్వరలో రానా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల తరువాత ఈ మూవీ అధికారిక టైటిల్ ని యూనిట్ అనౌన్స్ చేయనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తంగా ఈ సినిమా టైటిల్ అసలు భీమ్లా నాయక్ అవునా కాదా అనే సందిగ్ధానికి తెరపడాలి అంటే యూనిట్ ఈ విషయమై స్పందించాలి అంటున్నారు విశ్లేషకులు .... !
Follow @TBO_Updates
Post a Comment