Subscribe Us

Samantha Counter to Divorce rumours!


మొదటిసారి సమంత - నాగ చైతన్య బందంపై ఇటీవల ఎవరు ఊహించని రూమర్స్ వచ్చాయి. ఇద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నారని ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అలాగే సమంత S అని తన సోషల్ మీడియా పేరును మార్చుకోవడం కూడా అందుకు మరొక కారణమని కూడా అన్నారు. అయితే ఫైనల్ గా ఆ విషయాలన్నిటి పై సమంత ఒక్క మాటతో కౌంటర్ ఇచ్చేసింది.

సోషల్ మీడియాలో సమంత పేరెందుకు మార్చుకుంది? అని చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే దానిపై నేను రియాక్ట్ అవ్వాలని  అనుకోవడం లేదు. ‘ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ రిలీజ్ అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. దాదాపు 65,000 ట్వీట్ల వరకు పెట్టారు. ఏదైనా చెప్పండి స్పందించండి అంటూ అడిగారు.   కానీ, నాకు అలాంటి వాటిపై సమాధానం ఇవ్వాలనిపించలేదు. ఏ విషయంపై అయినా సరే నాకు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతాను అంటూ సమంత చాలా సింపుల్ గా వివరణ ఇచ్చింది.


Post a Comment

0 Comments