కార్తికేయ2: అప్పుడే 20కోట్ల ఆఫర్?


ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే భారీ స్థాయిలో లాభాలను అందిఅటున్నాయి. మార్కెట్ పెరుగుతున్న తరుణంలో డిమాండ్ ను బట్టి నాన్ థియేట్రికల్ వాల్యూ కూడా అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇక కార్తికేయ 2 యొక్క అన్ని భాషా శాటిలైట్ హక్కులు మరియు ఇతర భాషల డబ్బింగ్ హక్కులు రూ. 20 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. 

అలాగే, మేకర్స్ సినిమాను సొంతంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయకు సీక్వెల్ అయినటువంటి కార్తికేయ 2 లో నిఖిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఇక కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.


Post a Comment

Previous Post Next Post