మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచిన హాట్ బ్యూటీ?


సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ లెక్కలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయని చెప్పవచ్చు. ఒక్క హిట్టు వచ్చినా కూడా నటీనటులు అమాంతంగా జీతాలను పెంచేస్తూ వుంటారు. ఇక ఇటీవల కాలంలో ఎక్కువ సార్లు రెమ్యునరేషన్ డోస్ పెంచిన నటిమణుల్లో కీయరా అద్వానీ టాప్ లో ఉందని చెప్పవచ్చు. రామ్ చరణ్ 15వ సినిమాకు ఆమె 3.5కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్.

ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో షెర్షా సినిమా భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ ను అందుకోవడం వలన మళ్ళీ కొంత పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే సినిమాలకు కీయరా అద్వానీ దాదాపు 5కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం బాలీవుడ్ లో కత్రినా కైఫ్, అలియా భట్, దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్ వంటి హాట్ బ్యూటీలు అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. ఇక కీయరా అద్వానీ కూడా అదే తరహాలో వారి రేంజ్ ను అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post