టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ సమంత అక్కినేని పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగానే హాట్ టాపిక్ గా నిలిచింది. ముఖ్యంగా ఆమె పర్సనల్ విషయాలు నెవర్ బిఫోర్ అనేలా వైరల్ అయ్యాయి. ఇక ఆ వార్తలన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ సమంత మాత్రం వీలైనంత వరకు సైలెంట్ గా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రస్తుతం సమంత ఇన్ కమ్ కు సంబంధించిన అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో సమంత 15 మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకున్న విషయం తెలిసిందే. అయితే కేవలం తన ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఒక నెలలో నాలుగు కోట్ల వరకు ఆదాయాన్ని ఎందుకుంటున్నట్లు సమాచారం. రెగ్యులర్ గా ఒక బ్రాండెడ్ ప్రమోషన్ చేస్తే సమంత దాదాపు 7 నుంచి 13 లక్షల మధ్యలో ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా రెమ్యునరేషన్ కంటే కూడా సమంత సోషల్ మీడియా ద్వారానే ఒక నెలలో ని భారీ ఆదాయాన్ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యూటీ నెక్స్ట్ శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment