ప్రజలను మోసం చేసేందుకు ఫేక్ కలెక్షన్స్!


ఎపి మినిస్టర్ పేర్ని నానితో సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చిత్రప్రముఖులు మీటింగ్ నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో  ఫేక్ కలెక్షన్స్ పై టాలీవుడ్. సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడిన విధానం అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అంటూ 200వందల కోట్ల నుంచి 500 కోట్ల వసూళ్ళు అంటూ పేపర్లలో ఇచ్చే ప్రకటనలు కేవలం ప్రజల్ని మోసం చేయటానికే అని అన్నాడు. 

ఒకవేళ సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అనే ఆలోచనని కలిగించటానికే ఆ తరహలో ప్రకటన ఇస్తుంటామని, సినిమా అనే కలర్ ఫుల్ మాయ అని సి.కళ్యాణ్ సమావేశంలో వివరణ ఇచ్చారు. అంతే కాకుండా జాతిరత్నాలు వంటి సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయని మంత్రి పేర్ని నానికి స్పష్టం చేశారు కళ్యాణ్. ప్రస్తుతం సి. కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే గతంలో కొన్ని సినిమాల కలెక్షన్స్ నిజంగానే ఫేక్ అంటూ అభిమానుల మధ్య గొడవలు మొదలయ్యాయి.


Post a Comment

Previous Post Next Post