హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన యువ హీరో!కొన్ని రోజుల క్రితం, యువ హీరో అడివి శేష్ డెంగ్యూ జ్వరం భారిన పడిన విషయం తెలిసిందే. ఇక చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన అడివి శేష్ అనంతరం ప్లేట్‌లెట్స్ డౌన్ అయినట్లు రిపోర్ట్స్ రావడంతో పరిస్థితులు కొంచెం ఉద్రిక్తంగా మారినట్లు అనిపించింది. ఇక ఫైనల్ అతను కొలుకొని డిశ్చార్జ్ అయ్యాడు.

అతను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అడివి శేష్ మరికొన్ని రోజుల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడట. శేష్ ఈ సంవత్సరం విడుదల కానున్న తన హిందీ అరంగేట్రం మూవీ మేజర్ షూట్ దాదాపు పూర్తి చేసారు.  ఆ సినిమా మేజర్ ఉన్ని క్రిష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతుండగా మహేష్ బాబు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే హిట్ సినిమా సీక్వెల్ పై ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post