పోసాని ఇంటిపై దాడి.. కేసు నమోదు!


పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ వ్యవహారం మరింత సీరియస్ గా మారుతోంది. పోసాని ఇటీవలి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్‌ని దూషించిన విషయం తెలిసిందే. ఆ మాటలు పవన్ అభిమానులకు కోపం తెప్పించాయి. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోసాని నివాసంపై రాళ్లతో దాడి చేశారు.

హైదరాబాద్ యెల్లారెడ్డిగూడలో పోసాని ఇంటి వద్ద అర్ధరాత్రి 2 గంటలకు దాడి జరిగింది. దాడి సమయంలో పోసాని నివాసంలోని కొన్ని అద్దాలు దెబ్బతిన్నాయి.  పోసాని ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని వెరిఫై చేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి ఇటీవల ప్రెస్ క్లబ్‌లో చేసిన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోసాని కృష్ణ మురళి ఇటీవల రాయదుర్గంలో కొత్త నివాసానికి వెళ్లారు.


Post a Comment

Previous Post Next Post