మెగాస్టార్ తో చేయాల్సింది.. చివరికి ఇలా సెట్ అయ్యింది!


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మొత్తానికి రామ్ చరణ్ తో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక శంకర్ కు తెలుగు మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. గతంలో చాలాసార్లు ఆయన తెలుగులో డైరెక్ట్ గా ఒక తెలుగు సినిమా చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. ఆ మధ్యలో మహేష్ బాబును త్రి ఐడియట్స్ రీమేక్ కోసం అడిగారు. కానీ అందుకు ప్రిన్స్ ఒప్పుకోలేదు.

ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంగా శంకర్ తో సినిమా చేయాలని కూడా అడిగేశాడు. రోబో సమయంలోనే రజనీకాంత్ సలహాతో చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ కాంబో ఎందుకో సెట్టవ్వలేదు. ఇక ఇన్నాళ్లకు శంకర్  రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ సెట్ చేశాడు. రంగస్థలం చూసిన తరువాత శంకర్, చరణ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక RC15 సినిమాను శంకర్ తన రెగ్యులర్ మెస్సేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 జనవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Post a Comment

Previous Post Next Post