17లక్షలతో ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న ఎన్టీఆర్

 


జూనియర్ ఎన్టీఆర్ కు కార్లు బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల తన కొత్త కారు కోసం ఎన్టీఆర్ మళ్ళీ మరో ఫ్యాన్సీ నెంబర్ ను వేలం పాటలో దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో ప్రత్యేక నంబర్ల వేలం జరిగింది. అయితే ఫ్యాన్సీ కారు నెంబర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ కోసం రూ.17 లక్షలు వెచ్చించాడు.


ఇటీవల తారక్ లాంబోర్గిని ఉరుస్‌ అనే కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఫ్యాన్సీ నెంబర్ TS 09 FS 9999 నెంబర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 17లక్షలు ఖర్చు తన పాత రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో కూడా 10లక్షల వరకు ఖర్చు చేసి ఇదే తరహాలో ఒక నెంబర్ దక్కించుకున్నాడు. ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో ప్రత్యేక నంబర్ల వేలం వేయగా మొత్తంగా ఫ్యాన్సీ నెంబర్లకు రూ.45.52 లక్షల ఆదాయం లబించింది.

Post a Comment

Previous Post Next Post