ఖరీదైన కారు కొన్న RGV హీరోయిన్!


సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీ ఎక్కువగా హైలెట్ అవుతున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం గ్లామరస్ బ్యూటీలతో ఎక్కువగా హైలెట్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన చేసే సినిమాలు అంతగా క్లిక్కవ్వడం లేదు గాని చేతిలో పడిన బ్యూటీలు మాత్రం ఒక ట్రాక్ అయితే సెట్ చేసుకుంటున్నారు. అప్సర రాణితో థ్రిల్లర్, డేంజరస్ సినిమాలను చేసిన వర్మ ఆమెను సినిమాలకంటే ఎక్కువగా ప్రమోట్ చేశాడు.

ఇప్పటికి కూడా అప్సర రాణి వర్మతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. ఇక క్రాక్, సీటిమార్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ మొత్తానికి ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. 17లక్షల విలువ చేసే జీప్ కంపాస్ కారును కొనుగోలు చేసింది. అందుకే సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతే కాకుండా ఇటీవల వర్మ ఒళ్ళో కూర్చొని ఒక డిఫరెంట్ ఫొటోకు స్టిల్ ఇచ్చింది.


Post a Comment

Previous Post Next Post