సమంత గత కొంతకాలంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పూర్తిగా పక్కనపెట్టేసింది. కథలో పూర్తిగా కొత్తదనం ఉండే ఉంటేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాకు సంబంధించిన పనులను షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సమంత వీలైనంత త్వరగా మరొక మూవీని మొదలుపెట్టాలని అనుకుంటోంది.
అయితే ఇటీవల ఒక యువ దర్శకుడు చెప్పిన కథ ఆమెకు బాగా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఆ మూవీని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాత ఇంతకుముందు నాని జెంటిల్ మెన్, సుధీర్ బాబు సమ్మోహనం వంటి సినిమాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఒక సమంతతో సినిమా చేసేందుకే సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత నయనతార విజయ్ సేతుపతి నటిస్తున్న ఒక తమిళ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఆ సినిమా అనంతరం కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వనుందట.
Follow @TBO_Updates
Post a Comment