ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వైసిపిపై అలాగే అధికార పార్టీ నాయకులపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పోసాని కృష్ణమురళి స్పందించిన తీరు కూడా వివదస్పదంగా మారింది.
అయితే ఒకప్పుడు కత్తి మహేష్, శ్రీ రెడ్డి వంటి వారితో పవన్ కళ్యాణ్ ను కావాలని టార్గెట్ చేసి తిట్టించారని ఇప్పుడు అదే తరహాలో పోసాని విజృంభిస్తున్నట్లు జనసేన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు కామన్. అయితే పోసాని మాత్రం మరోసారి బూతులతో రెచ్చిపోవడం అందరిని షాక్ కు గురి చేసింది. గతంలో పవన్ పై ఎన్నోసార్లు పాజిటివ్ గా కామెంట్ చేసిన పోసాని ఈసారి ఇంతగా సీరియస్ అవ్వడంపై హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment