ముంబై డ్రగ్స్ కేసు: అమ్మాయిలతో అర్ధరాత్రి రేవ్ పార్టీలతో షారుఖ్ తనయుడు

 


ముంబై తీరంలో శనివారం రాత్రి క్రూయిజ్ రేవ్ పార్టీని ముగించిన తర్వాత షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ని నేడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విచారించింది.  కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లో ఎన్‌సిబి అధికారులు డ్రగ్స్ వాడుతున్నారు అనే అనుమనాలతో సోదాలు నిర్వహించారు మరియు అనేక మంది ప్రముఖుల కుటుంబాలకు సంబంధించిన యువతి యువకులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు..


ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ, ఆర్యన్ ఖాన్‌ను ఇంకా అరెస్టు చేయలేదని అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.  యాంటీ-డ్రగ్ ఏజెన్సీ అతడిని ప్రశ్నించడానికి మాత్రమే తీసుకువచ్చిందని అన్నారు. ఇక  ఎన్‌సిబి కార్యాలయం యువకులను ప్రశ్నించడానికి తీసుకెళ్లిన సంఘటనపై వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సిబి అధికారులు పక్కా సమాచారం అందుకున్న తర్వాత ఈ దాడి చేశారు. ఎన్‌సిబి బృందం రైడ్ చేసే క్రమంలో ప్రయాణికులుగా మారువేషాలు వేసుకుని క్రూయిజ్ ఎక్కినట్లు తెలిసింది.  క్రూయిజ్ సముద్రానికి చేరుకున్న వెంటనే రేవ్ పార్టీ ప్రారంభమైందని బృందం వెల్లడించింది.

Post a Comment

Previous Post Next Post