ఇలాంటి అసోసియేషన్ లో ఉండలేను..గుడ్ బై: ప్రకాష్ రాజ్


మా ఎన్నికల్లో ఓటమి కారణంగా ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. నేను తెలుగు వాడిని కాదు అని నన్ను ఓడించారని అన్నారు. మా తో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉంది.. అతిథిగా వచ్చాను.. అతిథిగానే ఉంటానని తెలిపారు.

ఇక మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారని అంటూ అలాంటప్పుడు నేను మా సభ్యుడు గా ఉండటం లో అర్థం లేదు. కాబట్టి "మా" సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానుని అని తెలియజేశారు. ఇక తెలుగు లో నటించడం కొనసాగిస్తాను అంటూ.. అలాగే నాకు ఓటు వేసిన అందరినీ గౌరవిస్తాను.. ఇలాంటి అజెండా వున్న అసోసియేషన్ తో పని చేయడం ఇష్టం లేదు.. మా కి రాజీనామా చేశాను తప్ప.. తెలుగు సినిమాని వదిలి పోవటం లేదు. ఇలాంటి వాతావరణంలో నేను ఉండలేను అంటూ ప్రకాష్‌ రాజ్ వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post