టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి


టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటు చేసుకుంది గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రాజబాబు కన్నుమూశారు. 64 సంవత్సరాల వయసున్న రాజబాబు ఇండస్ట్రీలో ఎంతో చురుగ్గా కనిపించేవారు. ఇక గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.

1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాజబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు చేశారు.  ఎక్కువగా కృష్ణవంశీ సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. సింధూరం, సముద్రం, మురారి సినిమాలతో పాటు వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, శ్రీకారం,   సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను, వంటి సినిమాల్లో కనిపించారు. మొత్తంగా 60కి పైగా చిత్రాల్లో నఠించినట్లు తెలుస్తోంది. ఇక రాజబాబు మృతిపట్ల పలువురు సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు

Post a Comment

Previous Post Next Post