బాలీవుడ్ అగ్ర దర్శకుడితో తారక్ చర్చలు?


మన టాలీవుడ్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండడంతో ఇతర ఇండస్ట్రీలోని అగ్ర దర్శకులు కూడా మన హీరోలతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  ప్రభాస్ తర్వాత అందరి ఫోకస్ ఎక్కువగా RRR హీరోల పైన పడింది. ఇప్పటికీ రామ్ చరణ్ శంకర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా బన్సాలీ జూనియర్ ఎన్టీఆర్ పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దేవదాస్, బాజీరావ్ మస్తానీ పద్మావతి, గంగుభాయ్ ఖతీయవాడి వంటి  సినిమాలను తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలి త్వరలోనే ఒక భారీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతున్నడు. అయితే అందులో బాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post