తెలుగులో మరో తమిళ హీరో దూకుడు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత ఒక తమిళ్ హీరో క్లీన్ హిట్ అందుకున్నాడు. రజనీకాంత్, కమల్ హాసన్ హవా తగ్గుతున్న క్రమంలో సూర్య, కార్తీ వంటి వారు కూడా సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ తన మార్కెట్ ను మెల్లగా పెంచుకుంటున్నాడు. ఇక అదే తరహాలో మరో తమిళ్ హీరో శివ కార్తికేయన్ కూడా తన హోదాను పెంచుకుంటున్నాడు.

ఇటీవల వచ్చిన డాక్టర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను అందుకుంది. ఈ సినిమాకు పండగ సీజన్ కూడా బాగా కలిసొచ్చింది. వీకెండ్ లో మొత్తానికి కోటికి పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఈజీగా అందుకుంది. ఇక భవిష్యత్తులో శివకార్తికేయన్ మరిన్ని డబ్బింగ్ సినిమాలతో వస్తాడని చెప్పవచ్చు. అలాగే జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కూడా ఒక ద్విభాషా సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు.


Post a Comment

Previous Post Next Post