ఫలించిన బండ్లన్న కల.. జీవిత రాజశేఖర్ ఓటమి

 


మురళీ మోహన్‌, మోహన్‌బాబు, జీవిత, రాజశేఖర్‌, నరేష్‌ సమక్షంలో కౌంటింగ్‌ మొదలయ్యింది, వీరితో పాటు డయాస్‌పై ప్రెసిడెంట్‌ అభ్యర్థులు మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్ కొనసాగారు. అయితే మొత్తానికి కౌంటింగ్ లో మొదట జీవితపై రఘుబాబు ఘనవిజయం సాధించారు.

జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జీవిత పోటీ చేయగా విష్ణు ప్యానెల్ నుంచి రఘుబాబు పోటీ చేశారు. అయితే 7 ఓట్ల తేడాతో జీవిత ఓటమి చెందడం విశేషం. తప్పకుండా ఆమె గెలుస్తుందని అనుకున్నారు. మొదట బండ్ల గణేష్ ఆమెకి పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎలాంటి ప్రభావం పడిందో ఏమో గాని మొత్తానికి ఆమె ఓటమి చెందారు.


Post a Comment

Previous Post Next Post