మా ఎన్నికల్లో గోడవ.. నటుడి చేయి కొరికిన హేమ

 


మా పోలింగ్‌లో రిగ్గింగ్‌ అనుమానాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి రిగ్గింగ్ చేస్తున్నాడంటూ మంచు విష్ణు బృందం ఆరోపణలు చేయడంతో కాసేపు పోలింగ్ కూడా నిలిచిపోయింది. ఓ వ్యక్తిని పట్టుకున్న పోలింగ్ సిబ్బంది తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు బృందాలను పిలిపించిన ఎన్నికల అధికారి... రెండు బృందాలతో చర్చలు జరిపారు.

రిగ్గింగ్‌ చేసినట్లు తేలితే ఫలితాలు ప్రకటించను అంటూ కోర్టుకు వెళ్తామని ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. అయితే ఎన్నికల గందరగోళంలో మోహన్ బాబు అధికారులతో మత్కడుతుండగా బెనర్జీ అడ్డు పడ్డాడు. దీంతో చంపేస్తాను అంటూ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు హేమ నటుడు శివ బాలాజీ చేయి కొరికినట్లు నరేష్ తెలియజేశారు. ఆ విషయంలో హేమ కూడా స్పందించారు. లోపల చాలా గొడవగా ఉంది అంటూ ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా?, ఎన్నికలు అయిపోయాక మాట్లాడుతాను అని వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post