Most Eligible Bachelor @ Review


కథ:
హర్ష (అఖిల్) ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరపడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. న్యూయర్క్ లోనే జీవితాన్ని కొనసాగించే అతను చివరికి ఒక వధువు దొరుకుతుందనే ఆశతో అతను ఇండియాకు రావాల్సి వస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అతనికి తన జీవిత భాగస్వామి కూడా పాత పద్దత్తుల్లో ఉండాలని అనుకుంటాడు. ఇక అతను జీవిత భాగస్వామి వెతికే సమయంలో స్టాండ్-అప్ కమెడియన్ గా జీవితాన్ని కొనసాగించే విభా (పూజ) ను కలుస్తాడు.  అతను ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. ఇక ఆమె మనసును ఏ విధంగా గెలిచాడు అనేది మిగిలిన సినిమా కథ.  

విశ్లేషణ:
మొదట్లో సినిమా ఫన్నీ సీన్స్ తో ఎంటర్టైన్మెంట్ తో కొనసాగుతుంది.  దర్శకుడు భాస్కర్ హర్ష 'పెళ్లి చూపులు' సిరీస్ ఎపిసోడ్‌లో కామెడీని క్రియేట్ చేసిన విధానం బాగానే వర్కౌట్ అయ్యింది. విభాతో హర్ష కలుసుకునే విధానం, అమ్మాయిలను ఆకర్షించడానికి చిట్కాలను పొందడం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 'గుచే గులాబీ', 'లెహరాయ్' పాటల ప్లేస్‌మెంట్, ట్యూన్‌లు మరియు పిక్చరైజేషన్ బాగున్నాయి.  అఖిల్ మరియు మురళీ శర్మ మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.  నేటి యువతరం వారి భవిష్యత్తు జీవిత భాగస్వాముల విషయంలో విభిన్నమైన అంచనాలను పెట్టుకోవడం ఈ కథలోని అసలు పాయింట్. అయితే సినిమా పాయింట్ ముందుకు సాగుతున్న కొద్దీ కొంచెం విసుగు తెప్పిస్తున్నట్లు అనిపిస్తుంది. వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు కోర్టు కేసు దాఖలు చేయడం, రొమాంటిక్ అడ్వాన్స్‌ల ఆధారంగా వ్యాపార ఒప్పందాన్ని బ్రోకర్ చేయడం వంటి కొన్ని అశాస్త్రీయ సన్నివేశాలు సినిమాని మరింత దిగజార్చాయి.

ఈ సినిమా కథలోని కొన్ని షేడ్స్ ఆరెంజ్ మూవీని గుర్తు చేస్తాయి. ఆ మధ్య వచ్చిన ‘షాది ముబారక్’తో ప్లాట్ పోలికలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా విషయంలో బొమ్మరిల్లు భాస్కర్ ఎక్కువగా వినోదాన్ని అందించడంపై దృష్టి పెట్టారు అనిపిస్తుంది.  కథను ఎమోషనల్ సన్నివేశాలను ఇంకా బాగా తెరకెక్కించాల్సింది. ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ అంతగా ఏమి వర్కౌట్ కాలేదు.  ద్వితీయార్ధంలో, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే  బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక GA2 బ్యానర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.  గోపి సుందర్ తన సంగీతంతో మరోసారి ఆకట్టుకున్నాడు. 

యాక్టర్స్ పెర్ఫామెన్స్ 
సినిమాలో అఖిల్ చాలా కూల్ గా నటించాడు. తన మునుపటి సినిమాల్లో కంటే నటనలో మరింత మెచ్యూరిటీ చూపించాడు. అయితే ఈ చిత్రం మొత్తంగా చూసుకుంటే ఉత్తమమైనది కాకపోవచ్చు. పూజా హెగ్డే గ్లామర్ తో మరోసారి బాగానే ఆకట్టుకుంది. కానీ ఆమెకు సంబంధించిన కొన్ని ఫన్నీ సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. ఇక మురళీ శర్మ, ప్రగతి పాత్రలు మధ్యమధ్యలో చాలా బాగా ఎట్రాక్ట్ చేస్తాయి. 
 

పాజిటివ్ పాయింట్స్ 
👉గుచ్చే గులాబీ - లెహరాయ్ పాటలు 
👉ఫస్ట్ హాఫ్ 

నెగిటివ్ పాయింట్స్ 
👉స్టోరీ లైన్ 
👉లైఫ్ పాట్నర్ కోసం మితిమీరిన సీన్స్ 
👉సెకండ్ హాఫ్ 

ఫైనల్ గా.. 
అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' స్టోరీ లైన్‌తో నేటితరానికి కనెక్ట్ అయ్యేలా ఉన్నప్పటికీ మేకింగ్ విషయంలో అందరికి కనెక్ట్ అయ్యేలా లేదని అనిపిస్తోంది. సినిమా మొత్తంలో ఏదైనా హైలెట్ అని చెప్పుకోవాలి అంటే ఆ రెండు పాటలే. మొత్తానికి అఖిల్ మరోసారి యావరేజ్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. 

Rating: 2.75/5

Post a Comment

Previous Post Next Post