Republic Movie - Review

 


కథ:
అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) ఒక తెలివైన విద్యార్థి.  తన చుట్టూ ఉన్న వారి గురించి అలాగే మొత్తం సమాజం యొక్క కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తరువాత అతను ఒక IAS అధికారిగా మారతాడు. నిజాయితీపరుడైన అభిరామ్  అవినీతి పరుడు తండ్రి అయినా సరే వ్యతిరేకిస్తాడు.  ప్రత్యేక అధికారాలతో జిల్లా కలెక్టర్‌గా మారిన తర్వాత, అభి అధికార పార్టీ అధిపతి విశాఖవాణి (రమ్యకృష్ణ) కు ఒక విషయంలో వ్యతిరేకంగా వెళతాడు.  తెల్లేరు సరస్సు వివాదం ఆధారంగా, అవినీతి వ్యవస్థతో అభి పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతను ప్రజావ్యవస్థపై అలాగే రాజకీయ అవినీతి దారులపై పోరాడుతూ ఉండగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఐశ్వర్య రాజేష్ అతన్ని ఎందుకీ కలిసింది? అనే అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
టాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత, పూర్తి స్థాయిలో పొలిటికల్  డ్రామా వచ్చి చాలా కాలం అయ్యింది. ఇక ఆ దారిలోన్స్ వచ్చిమా అత్యుత్తమ చిత్రాలలో ఒకటైన ప్రస్థానం దర్శకుడు దేవ కట్టా ఈసారి సరికొత్తగా రిపబ్లిక్ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చాడు. ఇక ఈ సినిమా కథకు తగ్గట్టుగా దర్శకుడు మొదట్లోనే ఒక మూడ్‌ని సెట్ చేసే ప్రయత్నంలో బాగానే సక్సెస్ అయ్యాడు. హీరో అభి పాత్ర, అతని స్వభావానికి సంబంధించిన ప్రధాన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక అభి తన రాష్ట్రానికి సేవ చేయడానికి USA అవకాశాలను కూడా త్యాగం చేస్తూ ఒక బాధ్యత కలిగిన యువకుడిగా కనిపించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. సాధ్యమైనంత వరకు వ్యవస్థను సరైన క్రమంలో నడిపించడానికి జిల్లా కలెక్టర్ అవుతాడు. కానీ పొలిటికల్ గా అతను ఇతర రాజకీయ వ్యవస్థ నుంచి కౌంటర్స్ ఎదుర్కొంటారు.

 

మరోవైపు స్థానిక రాజకీయ నాయకుడు విశాఖ వాణి కుమారుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఆమె పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. తెల్లేరు సరస్సు రాజకీయాల నుంచి ఎన్నారై వరుణ్ హాన్సెన్ హత్యకు దారి తీసిన పరణమాలు ఈ కథలు అసలైన లైన్, అతని సోదరి మైరా (ఐశ్వర్య రాజేష్) నిజాలు తెలుసుకోవడానికి భారతదేశానికి వస్తుంది. ఆమె ఆమె అభి నుండి సహాయం పొందుతుంది. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న నకిలీ ఎన్‌కౌంటర్‌ల ఆధారంగా దేవ కట్టా కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను హైలెట్ చేశాడు. అలాగే ఓటు బ్యాంకు రాజకీయాలపై ఫోకస్ పెడతాడు.  అలాగే కొన్ని నిజమైన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బలమైన డైలాగ్స్ కూడా ఆలోచింపజేస్తాయి. అయితే ప్రస్తుత  రాజకీయాల పరిణామాలను బాగానే తీసుకున్నప్పటికీ దర్శకుడు కథను ఆకట్టుకునే విధంగా చెప్పడానికి కొంత కష్టపడినట్లు అనిపోస్తుంది. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర    ఏ మాత్రం బాలేదు. కీలకమైన క్లైమాక్స్ కూడా నీరసంగానే ఉంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది గాని పాటలు అంతగా వర్కౌట్ అయితే కాలేదు.

 నటీనటుల ప్రతిభ..
సాటి ధరమ్ తేజ్ ఈ సినిమాలో నటించిన విధానం చాలా విబిన్నంగా అనిపించింది. ఒక కలెక్టర్ గా అతని హావభావాలు, మాట్లాడిన విధానం ప్రతి ఒక్కటీ కూడా చాలా బ్యాలెన్స్ తో వెళ్లినట్లు అనిపిస్తుంది. అయితే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర పై దర్శకుడు అంతగా ఫోకస్ చేయలేదు. కథలో ఆ స్పెస్ కూడా లేదు. కానీ ఆమె తన వరకు బాగానే నటించినప్పటికీ ఆ సీన్స్ అంతగా ఏమి ఆకట్టుకోవు. ఇక పొలిటికల్ పార్టీ లీడర్ గా రమ్యకృష్ణ మరొక పవర్ఫుల్ పాత్రతో సినిమాలో హైలెట్ గా నిలిచారు. జగపతి బాబు కూడా ఎప్పటిలానే తనదైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్:
నిజాయితీ గల మంచి కథ
సాయి ధరమ్‌తేజ్ పరిణితి చెందిన నటన

 దేవ కట్టా మార్క్ డైలాగ్స్ 


మైనెస్ పాయింట్స్:
ఎమోషన్స్ అంతగా వర్కౌట్ కాలేదు
 క్లైమాక్స్ బలహీనంగా ఉండడం
 సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడం, స్క్రీన్ ప్లే

ఫైనల్ గా... దేవకట్టా నిజాయితీ కథ


రేటింగ్: 2.75/5Post a Comment

Previous Post Next Post