సిరివెన్నెల ఇంటికి త్రివిక్రమ్ అల్లుడేంటి అన్నారు!


సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ కు ఇచ్చి పెళ్లి చేసింది ఆయనే. త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడు అవ్వకముందు నుంచే సిరివెన్నెలకు ఒక శిష్యుడిగా దగ్గరయ్యాడు. అయితే త్రివిక్రమ్ తెలివిని మంచితనాన్ని అందరికంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తుల్లో సిరివెన్నెల ఒకరు. సిరివెన్నెల ఇంటికి అల్లుడిగా అడుగు పెట్టక ముందు త్రివిక్రమ్ ఇంకా దర్శకుడిగా కూడా క్లిక్కవ్వలేదు. 

ఇక నా సోదరుడి కూతురిని త్రివిక్రమ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్టు కొంతమంది ప్రముఖులతో చర్చించినప్పుడు మీ ఇంటికి అంత తక్కువ స్థాయి వ్యక్తి అల్లుడిగా రావడం ఏమిటని కొందరు అపోహలతో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ త్రివిక్రమ్ గునగణాలను పసిగట్టిన సిరివెన్నెల అతను తప్పకుండా భవిష్యత్తులో ఒక మంచి దర్శకుడు అవుతాడని అందరిని ఒప్పించి సౌజన్యను ఇచ్చి పెళ్లి చేయించారు.


Post a Comment

Previous Post Next Post