దీపావళి బాక్సాఫీస్ ఫైట్.. ఎవరు డామినేట్ చేస్తారో?


ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.  మారుతీ మంచిరోజులొచ్చాయి స్ట్రెయిట్ తెలుగు సినిమాతో డబ్బింగ్ సినిమాలు రజనీకాంత్ పెద్దన్న, విశాల్ ఎనిమీ బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి. మంచిరోజులొచ్చాయి ట్రైలర్‌ కామెడీగా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మినీ బడ్జెట్ లో రూపొందించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెలెక్టెడ్ ఏరియాల్లో ప్రీమియర్ షోలకు కూడా వెళుతోంది.

ఇక రజనీకాంత్ రాబోయే చిత్రం అన్నాత్తే రేపు పెద్దన్నగా రికార్డు స్థాయిలో విడుదలవుతోంది. ఈ చిత్రం తమిళ ఫ్లేవర్‌తో లోడ్ చేయబడింది. సినిమాకు టాక్ బావుంటేనే క్లిక్కవుతుంది. ఇక విశాల్, ఆర్య నటించిన ఎనిమీ కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.  విశాల్ మరియు ఆర్య తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారే. ఈ చిత్రంపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక రేపు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ట్రయాంగిల్ ఫైట్  జరగనుంది. ఇక దీపావళి బాక్సాఫీస్‌ను ఏ సినిమా డామినేట్ చేస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post