ప్రభాస్ లైనప్ లో సీక్వెల్.. ?


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.  మొదట రాధేశ్యామ్ రానుండగా ఆ తరువాత సలార్ విడుదల కానుంది. ఇక ఆది పురుష్, ప్రాజెక్ట్ K తో పాటు స్పిరిట్ సినిమాలను లైన్ లో ఉన్నాయి. డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ఈ 5 పాన్ ఇండియా లైనప్ లో ఒక సీక్వెల్ ఉందట.

ఆ సీక్వెల్ మరేదో కాదు. రాధేశ్యామ్ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు రాధాకృష్ణ మరొక పాయింట్ ను రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ ఆ విషయంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే రాధేశ్యామ్ హిట్ అయితేనే ఆ సీక్వెల్ తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్ అయితే మంచి క్రేజ్ అందుకుంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Post a Comment

Previous Post Next Post