కవల పిల్లలకు జన్మనిచ్చిన BiggBoss5 కంటెస్టెంట్
Saturday, December 11, 2021
0
బిగ్ బాస్ సీజన్ 5 షోలో పాల్గొన్న ప్రముఖ సెలబ్రిటీలలో లోబో ఒకరు. అతను అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించ లేకపోయాడు. లోబో షోలోకి ప్రవేశించినప్పుడు, అతని భార్య గర్భవతి. అయితే లోబో దంపతులు ఈరోజు కవల పిల్లలకు జన్మనినచ్చినట్లు తెలుస్తోంది.
లోబోకు మగబిడ్డ, ఆడపిల్ల జన్మించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త లోబో అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక లోబోకి అత్యంత దగ్గరగా ఉండే కొందరు సెలబ్రెటీలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. ఇక మరోవైపు బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే వచ్చే వారం జరగనుంది.
Follow @TBO_Updates
Tags