మరోసారి ట్రై చేయబోతున్న రవితేజ?


మాస్ రాజా రవితేజ క్రాక్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక ఈ నటుడు తరువాత భారీ చిత్రాలతో రాబోతున్నాడు. అందులో ఖిలాడి సినిమా విడుదలకు సిద్ధమైంది.  ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ మాస్ పాట కూడా పాడబోతుబనట్లు తెలుస్తోంది.   రవితేజ పాటలు పాడటం  మొదటిసారి కాదు.  గతంలో బలుపు, పవర్, డిస్కోరాజా చిత్రాలకు గాత్రదానం చేశాడు.  రబితేజ పాట పాడడం ఇది నాలుగోసారి.

ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే సాంగ్ కంపోజింగ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  ఈ పాటను పాడటానికి రవితేజ సరిపోతారని DSP తో పాటు చిత్ర బృందం భావించింది.  త్వరలోనే పాటను విడుదల చేయనున్నారు.  ఖిలాడీ రవితేజను ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.  రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాల్లో నటిస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post