భయంతోనే బాలయ్యతో సినిమా చేయలేదు: రాజమౌళి


మాస్ కమర్షియల్ అంశాలు బాగా తెలిసిన దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఇన్నేళ్ల కెరీర్ లో తనకు తెలిసిన ప్రతీ స్టార్ హీరోకు కథ చెప్పాడు. అంతే కాకుండా కొంతమందితో చేయలని కూడా అనుకున్నాడు. అయితే అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడు. కానీ ఎందుకో ఆ కాంబో సెట్టవ్వలేదు. ఇక
నందమూరి బాలకృష్ణ అన్ స్టాప‌బుల్ షోలో రాజ‌మౌళిని ఆ విషయం గురించి ప్రత్యేకంగా అడిగాడు. 

నాతో సినిమా చేయమని ఫ్యాన్స్ అడిగితే ఆయనను హ్యాండిల్ చేయలేనని అన్నారట అని బాలయ్య అడగడంతో అందుకు రాజమౌళి ఈ విధంగా స్పందించారు.. ఒక విధంగా భయంతోనే ఆ మాట అన్నాను. మీరంటే ఇండస్ట్రీలో అందరికి గౌరవం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని గౌరవిస్తారు. కానీ నేను షూటింగ్ లో ఎలా ఉంటానో నాకే తెలియదు. హీరో ఎండలో ఉన్నాడా వానలో ఉన్నాడా అని కూడా చూసుకోను. హీరో కష్ట సుఖాల గురించి నేను పట్టించుకోను కాబట్టి బహుషా నేను పొరపాటు చేస్తే మీకు కోపం వస్తుందేమో అనే భయంతోనే మీ దగ్గరకు రాలేదు అని జక్కన్న క్లారిటి ఇచ్చాడు. ఇక అందుకు బాలయ్య షూటింగ్‌ అయ్యే వరకూ క్యారవాన్ లోపలకి వెళ్లనని, గొడుగు కూడా పట్టనివ్వనని సమాధానం ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post