పాము కాటుకు గురైన సల్మాన్ ఖాన్!


సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని పన్వెల్‌లోని ఆసుపత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళితే, సల్మాన్ తన కుటుంబంతో కలిసి తన పుట్టినరోజు వేడుక కోసం పన్వెల్ గెస్ట్ హౌస్‌లో ఉన్నాడు. 

అయితే సల్మాన్ గార్డెన్‌లో పడుకుని రిలాక్స్‌గా గడుపుతుండగా పాము కాటు వేసి అందరినీ షాక్‌కి గురి చేసింది. అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.  వైద్యులు విషాన్ని తొలగించారట. మరియు అతను ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డాడని కోలుకుంటున్నాడని చెబుతున్నారు.


Post a Comment

Previous Post Next Post